ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ (SFJ) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను ఇప్పుడు ఖలిస్తాన్(khalistan) అంటే భారతదేశంలో ప్రత్యేక దేశం కోసం ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించారు. పన్ను( Pannun) ఇలా చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు, సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తూ అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా,యూరప్‌తో సహా ఇతర దేశాలలో ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది. ఇందుకోసం పన్నూ సోషల్ మీడియా సాయం తీసుకుంటున్నాడు. దీనిలో SFJ టీమ్ అనే ఖాతా నుండి ప్రజాభిప్రాయ సేకరణపై ఓటింగ్ కోసం QR కోడ్ షేర్ చేశారు. అలాగే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునే విధానాన్ని వివరించారు. సిక్కులు – ఇతర మతాల ప్రజలు కూడా ఓటు వేయగలిగే ఫారమ్‌లను కూడా సంస్థ ఉంచింది.
అయితే, పోస్ట్ కనిపించిన 10 గంటల తర్వాత భారతదేశంలో ఆ ఎకౌంట్ నిషేధించాహ్రూ. దీని తర్వాత, క్యూఆర్ కోడ్ – రిఫరెండం పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో ఓటింగ్ తేదీని పేర్కొనలేదు.
ఇది కూడా చదవండి: AAP Documentary: అరవింద్ కేజ్రీవాల్ డాక్యుమెంటరీపై రాజకీయాలు.. స్క్రీనింగ్ ఆపేసిన ఢిల్లీ పోలీసులు
పంజాబ్ కాకుండా భారతదేశంలోని మరే ఇతర రాష్ట్రంలో నివసిస్తున్న సిక్కులు తమ ఓటు కోసం పేర్కొన్న QR కోడ్‌ను స్కాన్ చేయాలని లేదా www.sikhs4khalistan.net కు వెళ్లి నమోదు చేసుకోవాలని పోస్ట్‌లో పేర్కొన్నారు. . QR కోడ్‌ని స్కాన్ చేసినప్పుడు, ఒక పేజీ తెరుచుకుంటుంది. అందులో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఓటు వేయడానికి స్థలాలు గుర్తిస్తారు.
సిక్కు స్వాతంత్య్ర రెఫరెండం ఓటు కోసం ఇక్కడ నమోదు చేసుకోండి అని కూడా అక్కడ ఉంటుంది. ఓటు వేయడానికి, ఒక వ్యక్తి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి. సిక్కులు తమ ఫోన్ నంబర్, పేరు, ఇంటి చిరునామాను వ్రాసి పేర్కొన్న లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు.