CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇంధన శాఖపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన పార్టీ తెదేపానే అని ఆయన స్పష్టం చేశారు.
విద్యుత్ రంగంలో తెదేపా చేసిన మార్పులు
▶ 1988లోనే విద్యుత్ సంస్కరణలకు తెదేపా శ్రీకారం చుట్టింది.
▶ విద్యుత్ రంగాన్ని డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్‌మిషన్‌గా విభజించాం.
▶ విద్యుత్ కొరత లేకుండా ఏపీని తయారు చేసిన ఘనత మనదే.
▶ వ్యవసాయానికి యూనిట్ రేట్ నుంచి శ్లాబ్ రేటుకు మార్పు తెచ్చాం.
2014లో రాష్ట్రం 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో సతమతమయ్యిందని చంద్రబాబు గుర్తు చేశారు. కేంద్ర సహాయంతో తక్కువ కాలంలోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని, 2018 నాటికి ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిందని తెలిపారు.
Also Read: Pawan Kalyan: జనసేన “జయకేతనం”సభకు స్పెషల్ హెలికాఫ్టర్ లో పవన్
వైకాపా పాలనపై చంద్రబాబు విమర్శలు
వైకాపా ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేసిందని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. సరఫరాకు బదులుగా సర్‌ఛార్జీ విధించి, పరిశ్రమలపై భారాన్ని మోపింది వైకాపా ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు.
▶ 2019-24 మధ్య విద్యుత్ రంగం పతనమైంది.
▶ వైకాపా పీపీఏలను రద్దు చేసి అంతర్జాతీయ వివాదానికి కారణమైంది.
▶ దావోస్ వేదికపై కూడా ఏపీ విద్యుత్ పరిస్థితి చర్చనీయాంశమైంది.
▶ పీపీఏ రద్దుతో రాష్ట్ర ఖజానాకు ₹9,000 కోట్ల నష్టం జరిగింది.
చంద్రబాబు వైకాపా పాలన వల్ల రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులు వచ్చాయన్నారు. ఇకపై విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని ఆయన తెలిపారు.