Hit 3: నాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ 3’ థియేటర్లలో సందడి చేసింది. యువ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ కార్తీ ఆకట్టుకునే క్యామియోలో మెరిశాడు. క్లైమాక్స్‌లో కార్తీని ‘హిట్ 4’ లీడ్‌గా పరిచయం చేస్తూ చూపించిన సన్నివేశం థియేటర్లలో అభిమానులను ఉర్రూతలూగించింది.
అయితే, ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ సన్నివేశం వివాదాస్పదమైంది. తమిళ డబ్బింగ్ వెర్షన్‌లో కార్తీ పాత్ర తెలుగు ప్రజలను అవమానించేలా ఓ పదాన్ని ఉపయోగించినట్లు తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Akhanda 2: అఖండ 2 తాండవం: మంచు పర్వతాల్లో బోయపాటి మాస్ యాక్షన్ బ్లాస్ట్!
Hit 3: తెలుగు దర్శకుడైన శైలేష్ తమ సొంత ప్రేక్షకులను ఇలా చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై దర్శకుడు లేదా చిత్ర బృందం నుంచి స్పష్టత రాకపోతే, సన్నివేశాన్ని సవరించాల్సిందేనని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ గొడవ ఎటు దారితీస్తుందో చూడాలి!