Health Tips

Health Tips: చలికాలంలో వేడి పాలతో రెండు ఖర్జూరాలు తింటే

Health Tips: సాధారణంగా చలికాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. జలుబు, జ్వరం వంటివి రాకుండా జాగ్రత్తపడుతాం. అయితే చాలా మంది చలికాలంలో తక్కువ నీరు తాగుతారు. కానీ ఇది మంచిది కాదు. చలికాలంలో పాలు తాగడం ఇంకా మంచిది.పాలు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా చాలా పోషకాలు అందుతాయి. అందుకే చలికాలంలో పాలు బెస్ట్ ఫుడ్ అని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. వేడి పాలు తాగడం వల్ల చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రెండు ఖర్జూరాలను వేడి పాలతో కలిపి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Naveen Polishetty: అనగనగా ఒక రాజు’తో నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్

Health Tips: ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, మాంగనీస్ , కాపర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పాలలో క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాన్ని పాలలో కలిపి తాగడం లేదా ఖర్జూరాన్ని పాలతో కలిపి తినడం వల్ల పాలలోని పోషక విలువలు రెట్టింపు అవుతాయి. చలికాలంలో ఇందులోని పోషకాలు రెట్టింపు అవుతాయి.

Health Tips: ఖర్జూరం, పాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. నిజానికి ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ మొదలైన అన్ని కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. అంతేకాదు పాలను తేలికగా జీర్ణం చేసుకోలేని వారికి ఇది మేలు చేస్తుంది. అపానవాయువు లేదా మలబద్ధకం సమస్య నుండి బయటపడటానికి పాలలో ఖర్జూరం తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *