Harish Rao: సినిమా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న ఆ రాజ్యాంగేతర శక్తి బండారం త్వరలోనే భయటపెడతామని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో చోటుచేసుకున్న తారతమ్యాలు, సినిమాల విషయంలో తాను జోక్యం చేసుకోవడమే లేదని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించిన అనంతరం హరీశ్‌రావు స్పందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Harish Rao: సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక సినిమా టికెట్ల పెంపనకేమో అర్ధరాత్రి దాకా అనుమతి ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ తారతమ్యం ఎందుకని నిలదీశారు.
Harish Rao: వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్షగడతారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మీరు మర్చిపోయినందుకు ఇంకో హీరోను ఏకంగా జైలుకు పంపిస్తారా? అని నిలదీశారు. మీకు నచ్చిన వారి సినిమా అయితే రూ.600 టికెట్ రేట్లకు అనుమతి ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యత్యాసాలు ఎందుకు ఉంటున్నాయో ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
Harish Rao: గత ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్నికోట్లు వసూలు చేస్తున్నారో? అన్న వివరాలను త్వరలోనే బయట పెడతామని హరీశ్‌రావు హెచ్చరించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికే తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా టికెట్ రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
