Harish Rao: బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన సోమవారం (జూన్ 2న) హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో హరీశ్‌రావు చేసిన కీలక వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Harish Rao: ఇటు బీఆర్ఎస్ ఎదుగుదలపై, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ శ్రేణుల్లో రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ వైఖరిపై నెలకొన్న అనుమానాలు హరీశ్‌రావు వ్యాఖ్యలతో పటాపంచెలయ్యాయి. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీకి జరిగిన అవమానంపై హరీశ్‌రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు, విలీనంపై జరుగుతున్న ప్రచారాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 100 సీట్లు సాధించి బీఆర్ఎస్ సొంతంగా మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఎవరో పొత్తు పెట్టుకున్నం అన్నట్టు, ఇంకెవరో పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నారని, తాముఎవరితోనూ పొత్త పెట్టుకోబోమని తేల్చి చెప్పారు.
Harish Rao: పోలీసులు, అధికారులకు హరీశ్‌రావు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించినా, అక్రమ కేసులు పెట్టినా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వారి పేర్లను రెడ్ బుక్‌లో రాసుకొని, అధికారంలోకి వచ్చాక తగిన గుణపాఠం చెప్తామని వార్నింగ్ ఇచ్చారు.
Harish Rao: మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీపై అసభ్యకరంగా కొందరు ప్రవర్తించారని హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ, ఓ కార్పొరేషన్ చైర్మన్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీశారని ధ్వజమెత్తారు. ఆ ఆరోపణలపై సీఎం స్పందించి, సీసీ ఫుటేజీని విడుదల చేసి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Harish Rao: ఒక ఐఏఎస్ అధికారి, మరికొందరు అధికారులు కూడా మిస్ వరల్డ్ పోటీదారులతో అసభ్యంగా ప్రవర్తించారని వార్తలు వస్తున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. అలాంటి అధికారులను సస్పెండ్ చేసి, రాష్ట్రం పరువు కాపాడాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే సమీక్షలు చేస్తున్నారా? అని సీఎంను హరీశ్ రావు ప్రశ్నించారు.