Hari Hara Veeramallu Twitter Review

Harihara veeramallu: వీరమల్లు టికెట్ రేట్ల జోరు: తెలంగాణలో గ్రీన్ సిగ్నల్, ఏపీలో భారీ పెంపు!

Harihara veeramallu: పవన్ కల్యాణ్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ చిత్రం ‘వీరమల్లు’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. 12 రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమా ప్రమోషన్స్ హోరెత్తిస్తున్నాయి. నిర్మాత ఏఎం రత్నం టికెట్ ధరల పెంపు కోసం ప్రయత్నాలు షురూ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన, రూ.250 వరకు టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి సంపాదించారు.

అయితే, సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలను నిలిపివేసింది. భారీ బడ్జెట్ సినిమాలకు కొంత మేర పెంపునకు మాత్రమే అవకాశం ఇస్తోంది. ‘వీరమల్లు’కి ఒక వారం పాటు ఈ పెరిగిన ధరలు అమలులో ఉంటాయని సమాచారం. వారం తర్వాత సాధారణ ధరలకు మారనున్నాయి.

Also Read: R Narayana Murthy: సినిమా బాగుంటే జనం చూస్తారు.. ఆర్. నారాయణమూర్తి కీలక వాక్యాలు..

Harihara veeramallu: ఇక ఏపీలో మాత్రం ఫిలిం ఛాంబర్ ద్వారా టికెట్ ధరల పెంపు కోసం దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. పవన్ సూచనల మేరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఏపీలోనూ అనుమతి రానుంది, అయితే ఇక్కడ ధరలు కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *