gurukula:సంగారెడ్డి జిల్లాలోని మైనార్టీ గురుకులంలో విద్యార్థిని మృతి చెందిన ఘటన విషాదానికి దారితీసింది. జిల్లాలోని జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని సాధియా (14) మెట్లపై నుంచి పడి మృతి చెందింది. రాత్రి భోజనం చేసిన అనంతరం తన గదికి వెళ్తుండగా మెట్లపై నుంచి జారిపడి తీవ్రగాయాల పాలైంది. వెంటనే జహీరాబాద్ ఏరియా దవాఖానకు తరలించగా, అక్కడ ప్రథమ చికిత్స అందించారు.
gurukula:మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరంలోని గాంధీ దవాఖానకు తరలించారు. తీవ్రగాయాలతో ఉన్న ఆ బాలిక పరిస్థితి విషమించి, చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూసింది. దీంతో గురుకులంలో విషాదం అలుముకున్నది. తమతో కలిసి చదువుకొని, ఆడిపాడిన సాధియా కన్నుమూయడంతో తోటి విద్యార్థినులు కంటనీరు పెట్టుకున్నారు.