Gun Misfire: తన భద్రత కోసం ఉంచుకున్న తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో కాంగ్రెస్ నేత ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకున్నది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి ప్రాణహానీ లేదని వైద్యులు తేల్చి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Gun Misfire: కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నేత, ఐఎన్‌టీయూసీ నాయకుడు అయిన చిత్తరంజన్ శెట్టి తన వ్యక్తిగత భద్రత కోసం తుపాకీని ఉంచుకున్నారు. ఇది ఈ రోజు అనుకోకుండా ప్రమాదవశాత్తు బుల్లెట్ పేలడంతో ఆయనకు గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. దీంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.