Rahul Dravid: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒక రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అతను ప్రయాణిస్తున్న కారును ఓ గూడ్స్ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వీడియోలో రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఆటో డ్రైవర్తో వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోంది. ఇది చిన్న ప్రమాదం కావడంతో క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి కారణం ద్రవిడ్ నిర్లక్ష్యమా లేక ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమా అనేది స్పష్టంగా తెలియలేదు.ś
మంగళవారం సాయంత్రం బెంగళూరులోని కన్నింఘమ్ రోడ్డులో టీమిండియా మాజీ దిగ్గజ ప్లేయర్ మరియు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఒక పెద్ద అపాయం నుండి బయటపడ్డాడు. ట్రాఫిక్ లో ఆటో డ్రైవర్ వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టాడని ద్రవిడ్ చెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ సంఘటనకు సంబంధించి 11 సెకన్ల వీడియో వైరల్ అయింది.
ఇక ఈ వీడియోలో ద్రవిడ్ కారు నుంచి దిగి కారుకు జరిగిన డ్యామేజ్ ను పరిశీలిస్తూ, ఆటో డ్రైవర్ను కన్నడలో ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ ప్రమాదం ఎలా జరిగిందో వివరిస్తున్నాడు. ఈ ప్రమాదం హై గ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జురిడిక్షన్ లో చోటు చేసుకుంది. అయితే ఇంకా దీనిపై ఆధికారికంగా కంప్లైంట్ నమోదు కాలేదు. ప్రస్తుతం ద్రవిడ్ ఆటో డ్రైవర్ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Governor Flight: గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. అందులో గవర్నర్!
ఇకపోతే ఈ మధ్య కర్ణాటక ఆటో డ్రైవర్ల పై ఎన్నో అభియోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా వారు దురుసుగా ప్రవర్తించే తీరు, పక్క రాష్ట్రం వాళ్లకి చెప్పే అధిక రేట్లు…. రాపిడో, ఓలా వాళ్ళ వంటి సంస్థల డ్రైవర్ల పై దాడులు, అంతేకాకుండా కన్నడ భాషలో మాట్లాడకపోతే వాగ్వాదానికి దిగడం వంటివి ఎన్నో ఉన్నాయి. మరి అలాంటిది ఒక డ్రైవర్ చివరికి భారత క్రికెట్ మాజీ హెడ్ కోచ్ కారునే ఢీకొన్నాడు. ఇక దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.
ఇక ఎప్పుడూ వివాదాలకి దూరంగా ఉండే రాహుల్ ద్రావిడ్ సైతం గతంలో కూడా ఇలాగే ఒకసారి నష్టపోయాడు. 2018 లో రాహుల్ ద్రవిడ్ బెంగళూరుకు చెందిన ఓ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ తనను రూ.4 కోట్ల మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఆ కంపెనీ పలువురు క్రీడాకారులు, సెలబ్రిటీలను మోసం చేసినట్లు వార్తలు వచ్చాయి. అందులో రాహుల్ మొదటి వ్యక్తిగా తాను మోసపోయినట్లు కంప్లైంట్ ఇచ్చారు.