Guinness World Records: ‘ఔను వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు’! ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ అంటూ పాడుకున్నారు, ఈ ఇద్దరిదీ పదేండ్ల ‘ప్రేమ’, ‘నాకు నువ్వు నీకు నేను’ అని అనుకున్నారు, ‘నువ్వు నేను’ అని బాసలు చేసుకున్నారు, నాకు నీ ‘ప్రేమ కావాలి’ అని ఒకరికొకరు ఇష్టపడ్డారు, ‘ప్రేమదేశం’లో విహరించారు, ఒకరి ప్రేమకు మరొకరు ‘ప్రేమఖైదీసలై, ‘ప్రేమనగర్’లో విహరించి, ప్రేమప్రయాణంతో ఒక్కటే ‘పెళ్లి చేసుకున్నారు. వీరు ప్రేమ- పెళ్లితో ఆలుమగలు’ అయ్యారు.. ఇదేంది సోది అని అనుకోకండి. ఎందుకంటే ఈ జంట ముద్దు, మురిపెం చూడ ముచ్చటేస్తుంది కదూ! నాకూ అలాగే అనిపించి ఈ ప్రేమ మాటలు చెప్పాలనిపించింది. వారిని చూస్తే ఈ తెలుగు సినిమాల పేర్లు గుర్తొచ్చాయి.
Guinness World Records: అసలు విషయంలోకి వెళ్దాం రండి. ఈ ఫొటోలో ఉన్న వధువు పేరు మార్జోరీ పుట్టర్ మాన్, ఈ వరుడి పేరు బెర్నీ లిట్టర్ మాన్. వీరిద్దరిదీ అమెరికా దేశం. వీరు తమ 60 ఏండ్ల వయసొచ్చే వరకూ తమ తమ భాగస్వాములతో వైవాహిక జీవితాలను గడిపారు. ఆ తర్వాత వారిద్దరి భాగస్వాములు తనువులు విడిచారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇద్దరూ ఒంటరిగానే కాలం గడుపుతూ వచ్చారు. ప్రస్తుతం వధువుకు 102 ఏండ్ల వయసు. వరుడిది 100 సంవత్సరాల వయసు.
Guinness World Records: పదేండ్ల క్రితం అమెరికాలో ఫిలడెల్ఫియాలో జరిగిన ఓ క్యాస్టూమ్ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి ఈ ప్రేమికులు ఎవరికీ తెలియకుండా కలిసినప్పుడల్లా ముద్దు ముచ్చటలాడుకుంటూనే ఉన్నారు. ఇక వేగలేమంటూ తమ పిల్లలకు అసలు విషయం చెప్పాలనుకున్నారు. ఈ ఏడాది మే నెలలో తమ ప్రేమను బయటపెట్టారు. ఇద్దరం ఒక్కటి కావాలనుకున్నామని పిల్లలతో తేల్చి చెప్పారు. ఇంకేముంది.. వారి పిల్లలకు మొదట ఆశ్చర్యమేసినా ఆ తర్వాత ఔరా! ఇది దైవ నిర్ణయమే అనుకున్నారో? పూర్వ జన్మ సుకృతమేమోనని భావించారో? ఏమో కానీ ఒప్పేసుకున్నారు.
Guinness World Records: ఈ ఏడాది మే నెలలోనే ఈ వృద్ధుల ఇరు కుటుంబాలు వివాహం నిశ్చయించాయి. సీనియర్ లివింగ్ కమ్యూనిటీలో వీరి వివాహ కార్యక్రమాన్ని ఇరు కుటుంబాలు బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిపించారు. బెర్నీ, మార్జోరో వివాహాన్ని నిర్ధారిస్తూ డిసెంబర్ 3న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. వీరిద్దరి వయసు కలిపితే ఇప్పుడు ఏకంగా 202 ఏండ్ల 271 రోజులుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రకటించింది. మరో విశేషమేమిటంటే ఈ ఓల్డెస్ట్ జంట గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నది.