Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు దోచుకున్న ప్రజాధనాన్ని సింగపూర్‌లో దాచుకోవడానికే తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
“30 ఏళ్లలో చంద్రబాబు 58 సార్లు సింగపూర్ వెళ్లారు. అవినీతి సొమ్ముతో సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టారు. రియల్‌ఎస్టేట్‌పై చంద్రబాబు, లోకేష్‌లకు విపరీతమైన ఆరాటం. ప్రజల సొమ్మును దోచుకుని విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం సిగ్గుచేటు” అని అమర్నాథ్ ధ్వజమెత్తారు.
అదానీ డేటా సెంటర్‌పైనా అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “లోకేష్ అదానీ డేటా సెంటర్‌పై గొప్పలు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఆ డేటా సెంటర్ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై కూడా అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. “గత 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారు” అని ఆయన ఆరోపించారు.
