TGPSC: ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్న టీజీపీఎస్సీ గ్రూప్ 4 అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి వార్తను అందించింది. త్వరలో తుది ఫలితాల జాబితాను అందజేస్తామని ప్రకటించింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా విజయోత్సవాల సందర్భంగా గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
TGPSC: 2023 జూలైలో వివిధ విభాగాల్లో 8,180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలను నిర్వహించింది. ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. తుది ఫలితాలను మాత్రం ప్రకటించలేదు. దీంతో సుమారు 25 వేల మంది అభ్యర్థుల్లో ఆనందం నిండుకున్నది. అయితే బ్యాక్‌లాగ్ పోస్టులు లేకుండా ఫలితాలను ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: AP Nominated Posts: కూటమి ప్రభుత్వం నామినేటేడ్ పదవుల రెండో లిస్ట్.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి !
TGPSC: ఇప్పటికే జాప్యం జరగడంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొన్న సుమారు 3000 మంది అభ్యర్థులు ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధించి పైస్థాయి ఉద్యోగాల్లో చేరిపోయారు. దీంతో గ్రూప్ 4లో బ్యాక్‌లాగ్ లేకుండా ఇదే అభ్యర్థులతో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని వారు కోరుతున్నారు. మరి ఈ కొద్దిపాటి సమయంలో ప్రభుత్వం ఎలా వ్యవహారిస్తుందో వేచి చూడాలి మరి.