Gold Price Today

Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పడతాయని ఆశించిన సామాన్యులకు నిరాశే ఎదురవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న మార్పులు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుండటంతో దేశీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో తులం బంగారం ధర ఏకంగా లక్షా 35 వేల రూపాయల మార్కును దాటి పరుగులు తీస్తోంది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే బాటలో సాగుతూ సామాన్యులకు భారంగా మారుతోంది.

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే, శుక్రవారం నాటికి దేశీయ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,34,850 కి చేరుకోగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,610 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా ఏమాత్రం తగ్గకుండా కిలోకు రూ.2,11,100 గా నమోదైంది. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం, ఆర్థిక అనిశ్చితి కారణాల వల్ల మున్ముందు ఈ ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,850 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,23,610 గా ఉంది. అయితే వెండి ధరలో మాత్రం ప్రాంతాల వారీగా స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,24,100 ఉండగా, విజయవాడలో రూ.1,24,100 గా నమోదైంది. చెన్నైలో అత్యధికంగా తులం బంగారం (24 క్యారెట్లు) రూ.1,35,720 పలుకుతోంది.

బంగారం ధరలు ఎందుకు మారుతుంటాయంటే.. ఆయా రాష్ట్రాల్లో ఉండే పన్నులు (GST), రవాణా ఖర్చులు, స్థానిక జ్యువెలరీ అసోసియేషన్ నిర్ణయాల బట్టి నగరాల మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో డిమాండ్ పెరిగి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి, బంగారం కొనాలనుకునే వారు ఎప్పటికప్పుడు తాజా ధరలను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *