Gold Price Today: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు కొనుగోలుదారులకు ఒక్కసారిగా షాకిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చిన మార్పుల వల్ల దేశీయంగా కూడా పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. వారం ప్రారంభ రోజైన సోమవారమే ధరలు పెరగడంతో పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కొనాలనుకునే వారికి ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే వెండి ధరలు మాత్రం ప్రస్తుతానికి స్థిరంగానే కొనసాగుతున్నాయి.
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. హైదరాబాద్‌లో నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.320 పెరిగి రూ.1,59,380 కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.1,46,100 వద్ద ట్రేడవుతోంది.
ఇక పొరుగున ఉన్న చెన్నైలో బంగారం ధరలు మరింత ఎక్కువగా పెరిగాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ.550 పెరిగి రూ.1,61,240 కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ.1,47,800 వద్ద కొనసాగుతోంది. ఐటీ హబ్ బెంగళూరులో మాత్రం హైదరాబాద్ తరహాలోనే ధరలు ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్లు రూ.1,59,380 గాను, 22 క్యారెట్లు రూ.1,46,100 గాను నమోదయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పసిడి ధరలు పైపైకే వెళ్లాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,530 కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,46,250 వద్ద అమ్ముడవుతోంది. బంగారం ధరలు ఇలా పెరిగినప్పటికీ, వెండి ధరలు మాత్రం పెరగకుండా స్థిరంగా ఉండటం కొంత ఊరట కలిగించే విషయం. ప్రస్తుతం కేజీ వెండి ధర ఢిల్లీ, బెంగళూరులలో రూ.2.85 లక్షలుగా ఉంటే, హైదరాబాద్‌లో మాత్రం రూ.2.95 లక్షల వద్ద కొనసాగుతోంది.
