Gold Price Today

Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తాజా రేట్లు ఇవే!

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి వరుసగా రెండో రోజు కూడా చేదు వార్తే ఎదురైంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దీని ప్రభావం మన దేశీయ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గత వారం ఏకంగా 3 వేల రూపాయల మేర పెరిగిన బంగారం ధర, ఈ వారం కూడా అదే బాటలో సాగుతుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నిన్న భారీగా పెరిగిన ధరలు, నేడు (మంగళవారం) కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు ఒకేలా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 1,46,250 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కేవలం 10 రూపాయలే పెరిగినప్పటికీ, రికార్డు స్థాయి ధరల వద్దే కొనసాగుతుండటం గమనార్హం. అదేవిధంగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,34,060 వద్ద ఉంది.

దేశంలోని ఇతర నగరాల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. చెన్నైలో బంగారం ధరలు మిగిలిన నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,46,740 వద్ద ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1,46,400గా నమోదైంది. బెంగళూరులో కూడా తెలుగు రాష్ట్రాలకు సమానంగానే ధరలు కొనసాగుతున్నాయి. వరుసగా రేట్లు పెరుగుతూ ఉండటంతో శుభకార్యాల కోసం బంగారం కొనేవారు ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉన్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వెండి కిలో ధర రూ. 100 మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ. 3,18,100 వద్ద ఉండగా, ఢిల్లీలో రూ. 3,05,100 వద్ద కొనసాగుతోంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడే వరకు పసిడి ధరలు తగ్గే సూచనలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *