Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి వరుసగా మూడో రోజు కూడా నిరాశే ఎదురైంది. అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న మార్పుల వల్ల మన దేశంలో కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా రేట్లు పెరుగుతూనే ఉండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ మొదలైన ఈ సమయంలో ధరలు ఇలా పెరగడం కొనుగోలుదారులకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం ధరల వివరాలు చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,570 కు చేరింది. నిన్నటితో పోలిస్తే ఇది రూ.220 పెరిగింది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.1,42,600 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కూడా ఇవే ధరలు ఉండగా, చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల బంగారం రూ.1,56,230 వద్ద విక్రయించబడుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పసిడి సెగ తగిలింది. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,720 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,750 కు చేరుకుంది. కేవలం బంగారమే కాకుండా వెండి ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి. హైదరాబాద్ మరియు చెన్నైలలో కేజీ వెండి ధర రూ.2,75,100 వద్ద ఉండగా, ఢిల్లీలో రూ.2,70,100 గా ఉంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వెండి కూడా ఇప్పుడు క్రమంగా పెరుగుతూ వస్తోంది.
గ్లోబల్ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా పెరిగిన డిమాండ్ వెరసి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఈ పెరుగుదల ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి పసిడి ప్రియులు ధరలు కొంచెం తగ్గేవరకు వేచి చూడాలా లేక ఇప్పుడే కొనేయాలా అనే అయోమయంలో ఉన్నారు.
