Fake Documents: నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకు ఖాతాలు సృష్టించి విక్రయిస్తున్న బడా నెట్‌వర్క్‌ను భోపాల్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ఈ మోసాలకు పాల్పడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు భోపాల్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ పత్రాలు తయారు చేసేవారు. ఇందుకోసం ఇబ్రహీంపురలోని ఓ గదిలో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. విచారణలో, నిందితులు దేశంలోని 6 వేర్వేరు నగరాల్లో నివసిస్తూ నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసినట్లు అంగీకరించారు. వీటిలో ఇండోర్, భోపాల్, లక్నో, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Israile: ప్రధాని నివాసం పై బాంబు దాడి
Fake Documents: నిందితులు ఈ నగరాల్లో నకిలీ బ్యాంకు ఎకౌంట్స్ సృష్టించారు. నకిలీ పత్రాలతో సృష్టించిన 1800 ఎకౌంట్స్ ను నిందితులు విక్రయించారు. ఈ ఖాతాల్లో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. రూ.10 వేలకు నకిలీ ఖాతాలనుసృష్టించి విక్రయించినట్టు నిందితులు సమాచారం ఇచ్చారని పోలీసు కమిషనర్ హరినారాయణ చారి మిశ్రా తెలిపారు. . నిందితులందరూ 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్న వారేనని, ప్రధాన నిందితుడు రెండు నెలలకు మించి ఏ నగరంలో కూడా నివసించలేదని పోలీసుల విచారణలో తేలింది.
Fake Documents: ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌ఫార్మర్ సమాచారంతో హనుమాన్‌గంజ్ పోలీసులు నిందితులు ఉన్న ప్రాంతంపై దాడి చేసి నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశారు. నిందితులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ను కంప్యూటర్ ద్వారా మార్పులు చేసి నకిలీ పత్రాలు సృష్టించేవారమని విచారణలో వెల్లడించారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా బ్యాంకు ఖాతాలు, సిమ్‌లు కొనుగోలు చేశారు. తద్వారా సైబర్ మోసానికి పాల్పడ్డారు.