Game Changer in Buses: గేమ్ ఛేంజర్ సినిమా పై అన్ని రకాలుగానూ దాడి మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. సినిమా రిలీజ్ అయిన వెంటనే నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. నెగెటివ్ ట్రోలింగ్ విపరీతంగా జరుగుతూ వస్తున్నాయి. వీటిని తట్టుకుని మెల్లగా ఆడియెన్స్ లో పాజిటివ్ టాక్ మొదలవుతున్న సమయంలో సినిమా హై క్వాలిటీ ప్రింట్ నెట్టింట్లో దర్శనం ఇచ్చేసింది. ఇక దారుణం ఏమిటంటే సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళుతున్న బస్సుల్లో ఈ వీడియో ప్రదర్శించారు . మేము సినిమా బస్సులో చూస్తున్నామోచ్ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది . దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు
