Fact Check : విశాఖపట్నంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో జేఈఈ పరీక్షకు హాజరు కాలేని విద్యార్థుల గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. పవన్ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో, 30 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయారని ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలపై స్పందించిన పవన్ కల్యాణ్, విశాఖ పోలీసులను విచారణ జరపాలని ఆదేశించారు. తన కాన్వాయ్ వల్ల ఎంతసేపు ట్రాఫిక్ నిలిచింది? పరీక్షా కేంద్రాలకు వెళ్లే మార్గంలో పరిస్థితి ఏంటి? సర్వీస్ రోడ్లలోనూ ఆంక్షలు విధించారా? అనే ప్రశ్నలకు సమాధానాలు కోరారు.
అయితే, విశాఖ పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు. సోమవారం పవన్ పర్యటన జరిగినప్పటికీ, బీఆర్టీఎస్ సర్వీస్ రోడ్లలో ఎక్కడా ట్రాఫిక్ నిలిపివేయలేదని వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ ప్రథ్వీతేజ్ స్పష్టం చేశారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష చినముషిడివాడలోని ఐయాన్ డిజిటల్ కేంద్రంలో జరుగుతోంది. విద్యార్థులు ఉదయం 7 గంటలకే పరీక్ష కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 8 గంటల 30 నిమిషాలకే పరీక్ష కేంద్రం గేట్లు మూసేస్తారు.. కానీ, పవన్ కాన్వాయ్ ఆ మార్గంలో వెళ్లింది ఎగ్జాక్ట్‌గా 8 గంటల 41 నిమిషాల సమయంలో!!! అంటే.. పవన్ కాన్వాయ్ ఆ ప్రాంతాన్ని దాటి వెళ్లే సమయానికి పది నిమిషాల ముందే… పరీక్ష కేంద్రం గేట్లు కూడా మూత పడ్డాయ్. కాబట్టి, విద్యార్థులు ఆలస్యమవడానికి పవన్ పర్యటన కారణం కాదని పోలీసులు వెల్లడించారు.
ఈ పరీక్షలు సోమవారమే ప్రారంభం కాలేదు. ఏప్రిల్ 2 నుంచి జరుగుతున్నాయి. నాలుగు రోజుల్లో వరుసగా మొదటి రోజు 81 మంది, రెండో రోజు 65 మంది, మూడో రోజు 76 మంది, నాలుగో రోజు 61 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సోమవారం కేవలం 30 మంది గైర్హాజరు కాగా, ఇది రోజువారీ గైర్హాజరీలో భాగమేనని పోలీసులు తెలిపారు.
Also Read: Tamilnadu: మాజీ గవర్నర్ ఇంట విషాదం.. సీనియర్ కాంగ్రెస్ నేత కన్నుమూత
Fact Check : గోపాలపట్నం, పెందుర్తి జంక్షన్లలో 8:30 గంటల వరకు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. అదే రోజు, పవన్ అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ‘అడవి తల్లి బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మంచి పని నడుస్తుండగానే, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జోరందుకుంది. ఇక జగన్ సొంత పత్రికలో అయితే.. మంగళవారం నాడు అసత్యాలతో ఆవు కథ లాంటి ఓ కథనాన్ని అల్లేసి… పవన్ కళ్యాణ్‌కి అంటగట్టాలని చూశారు.
మొత్తానికి విశాఖ పోలీసులు సమగ్ర ప్రకటన జారీ చేసి, ఈ వార్తల్లో వాస్తవం లేదని తేల్చారు. పవన్ కాన్వాయ్ వల్ల విద్యార్థులకు అడ్డంకి కలిగిందన్నది కేవలం ఊహాగానమే అని తేలిపోయింది. సోషల్ మీడియా, బులుగు మీడియా రూమర్స్‌కు చెక్ పెడుతూ, నిజం బయటపడింది!