Haryana: హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన గురుగ్రామ్‌లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుదిశ్వాస విడిచారు. 89 ఏళ్ల వయసు కలిగిన చౌతాలా హర్యానా రాజకీయాల్లో తన ప్రత్యేక ముద్ర వేశారు.
చౌతాలా 1989 నుంచి 2005 మధ్య ఐదుసార్లు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు. వృద్ధాప్యంతో పాటు ఆరోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా రాజకీయంగా సక్రియంగా ఉండలేదు. ఆయన మరణం హర్యానా రాష్ట్రానికి, ప్రత్యేకంగా రాజకీయ రంగానికి తీరనీయ లోటు.
