Badam Benefits

Badam Benefits: బాదం తిన‌డం వ‌ల్ల అద్భుత ప్రయోజ‌నాలు ఇవే

Badam Benefits: బాదం ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. బాదం ప‌ప్పును రోజూ తిన‌డం వ‌ల‌న వాటిలో ఉండే పోష‌కాలు, ఖ‌నిజ ల‌వ‌ణాలు సైతం శ‌రీరానికి తగు మొత్తంలో అంది ఆరోగ్యాన్ని నిల‌క‌డ‌గా ఉంచుతుంది. బాదం పప్పును అనేక రకాలుగా తినవచ్చు, అది పచ్చిగా తిన‌వ‌చ్చు లేదా నాన‌బెట్టి తిన‌వ‌చ్చు. ఇంకా చెప్పాలంటే డెజర్ట్‌లు, కూరలు లేదా సలాడ్‌లలో కూడా చేర్చి తీసుకోవచ్చు. దీనిలో పోషకాలు విరివిగా ఉండ‌డం వ‌ల‌న మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా అవ‌స‌రం. ఇవి చాలా రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి, అందానికి కూడా మెరుగైన‌ది.

Badam Benefits: బాదం ప‌ప్పును రాత్రి నానబెట్టి ప్ర‌తిరోజూ ఉద‌యాన్నే తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇది మెద‌డు ప‌నితీరును మెరుగుప‌రుస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బాదం ప‌ప్పులో విట‌మిన్ ఇ, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి.ఇవ‌న్నీ మెద‌డు, గుండె సక్ర‌మంగా ప‌నిచేసేట‌ట్టు చేస్తాయి.  శరీరంలో మెగ్నీషియం లోపం అనేది జుట్టు రాలడానికి దారితీస్తుంది. బాదంపప్పులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. క‌నుక‌ వాటిని రోజూ తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా ఉండి స్థిరంగా పెరగడానికి  సహాయపడుతుంది.మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు బాదంలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు బాగా ప‌నిచేస్తాయి. ముఖంపై వ‌చ్చే మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్‌ను కూడా బాదాం నయం చేస్తుంది. మెదడు ప‌నితీరును బాదం మెరుగుపరుస్తుంది. మెదడులో ఉత్తేజిత హార్మోన్ల పెరుగుదలకు ఇది సహాయపడుతుంది. ఫెనిలాలనైన్ అనే రసాయనం మెదడు చురుకుద‌నానికి  సహాయపడుతుంది. ఇది మీరు బాదం ద్వారా పొందవచ్చు. అందువల్ల ప్రతిరోజూ ఉదయం కనీసం ఐదు నుండి ఆరు బాదం పప్పులను తినడం మంచిది.

Badam Benefits: గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం బాదం ప‌ప్పును త‌రుచూ తీసుకోవాలి. గుండె స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బాదం వారి ఆహ‌రంలో త‌ప్ప‌నిస‌రిగా చేర్చుకోవాలి. అంతేకాదు రక్తపోటును తగ్గించడంలో శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రవాహాన్ని అందించడంలో సహాయపడతుంది.అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు, శరీరంలో విటమిన్ E స్థాయిలను పెంచేందుకు  బాదం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.  బాదం పప్పులో కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉండటం, ప్రొటీన్లు మరియు ఫైబర్  అధికంగా ఉండటం వల్ల అవి చాలా గంటల పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఇది రోజంతా అవసరమైన ఆహారం కంటే ఎక్కువ తినడం నుండి మిమ్మల్ని ఆపివేస్తుంది.

ఇవికూడా చదవండి :  

Health Tips: కొవ్వు కరగిపోవాలంటే..  గ్రీన్ టీతోపాటు వీటిని కలిపి తీసుకోండి! 

Blood Sugar: రాత్రిపూట ఈ డ్రింక్స్ తాగితే… బ్లడ్ షుగర్ కు చెక్ పెట్టొచ్చు!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *