WI vs ENG: వెస్టిండీస్ టూర్ లో ఇంగ్లండ్ జట్టుకు గట్టి దెబ్బ తగింది. వర్షం అంతరాయం కలిగించిన తొలి వడ్డేలో వెస్టిండీస్ టీమ్ ఘన విజయంతో వన్డే సిరీస్ లో శుభారంభం చేసింది. ఇవిన్ లూయిస్ 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 69 బంతుల్లోనే 94 పరుగులు చేయడంతో 25.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 157 లక్ష్యాన్ని అందుకుంది. . తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 45.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది.
ఇది కూడా చదవండి: South Africa: సూర్య సేనను ఢీకొట్టే సఫారీ జట్టు ఇదే
WI vs ENG: గుడకేశ్ మోటీ 4 వికెట్లతో ఇంగ్లండ్ ను దెబ్బతీశారు. 48 పరగులుతో లివింగ్‌స్టోన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 81 పరుగులతో ఉన్నప్పుడు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో.. లక్ష్యాన్ని 35 ఓవర్లలో 157 పరుగులుగా సవరించారు. లూయిస్ ధాటిగా ఆడటంతో లక్ష్యం వేగంగా కరిగిపోయింది. బ్రాండన్ కింగ్ 30 పరుగులతో రాణించాడు. రెండో వన్డే శనివారం జరుగుతుంది.