Papaya Benefits

Papaya Benefits: బొప్పాయి తింటే ఈ వ్యాధులు రావు..

Papaya Benefits: చలికాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ఈ సీజన్ లో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతాం. రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే చలికాలంలో మంచి ఆహారం తీసుకోవాలి. వింటర్ లో ఆరోగ్యంగా ఉండాలంటే బొప్పాయిని ప్రతిరోజూ తినాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసే సూపర్ ఫుడ్.

రోజూ ఉదయం ఖాళీ కడుపుతో 200 గ్రాముల బొప్పాయి తింటే శరీరానికి సంపూర్ణ పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పండు పోషకాల లోపాన్ని అధిగమించి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ఇది కాకుండా బొప్పాయిని రోజూ తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి:
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జలుబు, ఫ్లూ వంటి సమస్యలను నివారిస్తుంది. ఈ పండును రోజూ తింటే ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

బరువు కంట్రోల్ :
బొప్పాయి బరువు తగ్గడంలో బాగా పనిచేస్తుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. చలికాలంలో వ్యాయామం లేకుండా, అతిగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి అలాంటి సమయంలో ప్రతిరోజూ బొప్పాయి తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

చర్మ ఆరోగ్యం:
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే బొప్పాయిని రోజూ తినాలి. విటమిన్ ఎ సహా యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న బొప్పాయి చర్మంలో తేమను కాపాడుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి:
బొప్పాయిలో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. ఈ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. మధుమేహ వ్యాధిగ్రస్తులు బొప్పాయిని రోజూ తింటే జీర్ణక్రియ బాగుంటుంది.

జీర్ణ ఆరోగ్యం:
మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు చలికాలంలో ఎక్కువగా బాధిస్తాయి. కానీ బొప్పాయిని రోజూ తింటే జీర్ణక్రియ సమస్యలన్నీ దూరమవుతాయి. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజూ 200 గ్రాముల బొప్పాయి తింటే గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చోవడం మానుకుంటారు.

గుండె ఆరోగ్యం:
యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే బొప్పాయి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. బొప్పాయి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులను నివారిస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *