E20 Janta Party: నీట్ (NEET) పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా పోరాడి కేంద్ర మంత్రి రాజీనామాకు కారణమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) సక్సెస్‌తో, సోషల్ మీడియా వేదికగా మరొక సరికొత్త ఉద్యమం ప్రారంభమైంది. అదే ‘E20 జనతా పార్టీ’.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ఆన్లైన్ పార్టీ స్వరం పెంచింది. వినియోగదారులకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలనే ప్రధాన డిమాండ్‌తో ముందుకు వచ్చింది.
1. ‘E20 జనతా పార్టీ’ ప్రధాన డిమాండ్లు ఏంటి?
పెట్రోల్ బంకుల్లో కేవలం E20 (20% ఇథనాల్ కలిపిన) పెట్రోల్ మాత్రమే కాకుండా, 100% స్వచ్ఛమైన పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలి. ఏది వాడాలో నిర్ణయించుకునే హక్కు వినియోగదారులకే ఇవ్వాలి.వివిధ రకాల ఇంధనాల లాభనష్టాలు, ప్రయోజనాలపై పెట్రోల్ బంకుల్లో స్పష్టమైన వివరాలు (లేబుల్స్) ప్రదర్శించాలి. E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గడం, ఇంజిన్లు పాడవ్వడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి సమస్యలపై స్వతంత్ర పరిశోధన జరిపి, ఆ నివేదికలను ప్రజలకు బహిర్గతం చేయాలి.
2. సోషల్ మీడియాలో పెరుగుతున్న మద్దతు
ఈ20 జనతా పార్టీ తాము ఏ ఇథనాల్ కలయికకూ వ్యతిరేకం కాదని, అయితే ప్రత్యామ్నాయం (Pure Petrol) లేకపోవడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది.ప్రస్తుతం ‘ఎక్స్’ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ పార్టీ ఖాతాలకు వేలాదిగా ఫాలోవర్లు పెరుగుతున్నారు.కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విధానాలను లక్ష్యంగా చేసుకుంటూ, ఇంధన రంగంలో మార్పుల కోసం ఇవి ప్రచారం చేస్తున్నాయి.
3. ఆన్లైన్ ఉద్యమాల కొత్త ట్రెండ్!
కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించడంతో, దేశంలో వివిధ సమస్యలపై ఆన్లైన్ వేదికలుగా ఇలాంటి కొత్త వేదికలు, పార్టీలు పుట్టుకొస్తున్నాయి. రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఇంధన విధానాల వరకు ప్రజలు తమ డిమాండ్లను డిజిటల్ ఉద్యమాల ద్వారా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
🚨 STOP EXPERIMENTING ON OUR CARS! INDIA DEMANDS CHOICE OF FUEL!
Our vehicles are NOT test machines. We bought them with our hard-earned money after paying taxes years in advance.
We are a middle-class majority country, and fuel efficiency + vehicle performance directly impacts… pic.twitter.com/6wI0vquOCP
— E20 JANTA PARTY (@E20Party) July 26, 2026
