Dubai:యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. బతుకుదెరువు కోసం వెళ్లిన అతని బతుకు పదుగురికి బతుకు దెరువు చూపేలా మారింది. కష్టపడే ఆ కుటుంబంపై కనకవర్షం కురిసింది. ఏకంగా కోట్ల రూపాయలు ఆ కుటుంబం దరిచేరడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులే లేకుండా పోయింది. వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా రూ.2.32 కోట్లు ఓ లక్కీ డ్రాలో గెలుపొంది రాత్రికి రాత్రే ధనవంతుల జాబితాలో చేరిపోయాడు.
Dubai:హైదరాబాద్‌కు చెందిన రాజమల్లయ్య గత 30 ఏండ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు. ప్రస్తుతం ఆయన అక్కడే ఓ కంపెనీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య, పిల్లలు హైదరాబాద్‌లో ఉంటుండగా, ఆయన మాత్ర అబుదాబిలో ఒంటిరిగా అక్కడే ఉంటూ కుటుంబానికి ఎంతో కొంత పంపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన అక్కడికి వెళ్లిన 30 ఏండ్ల నుంచి ఏటా లాటరీ టికెట్లు కొంటూ వస్తున్నాడు. ఏనాడూ ఆయనకు లక్ష్మీ కటాక్షం కలగలేదు.
Dubai:ఈ ఏడాది మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో టికెట్ కొన్నాడు. ఏకంగా మిలియన్ దిర్హమ్స్ అంటే రూపాయల్లో 2.32 కోట్ల విలువైన లక్కీ లాటరీ రాజమల్లయ్యకు తగిలింది. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒంటరిగా కుటుంబం కోసం కష్టపడుతున్న అతని కష్టానికి మించి ఫలితం దక్కిందని పలువురు కొనియాడుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న అతని కుటుంబం కూడా ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నది.
Dubai:నేను ఇంతకు ముందు చాలా టికెట్లు కొన్నా కానీ లాటరీ రాలేదు. ఈ సారి వచ్చింది. ఈ సొమ్మును నా కుటుంబం కోసం వినియోగిస్తా.. అని రాజమల్లయ్య చెప్పారు. కొంత భవిష్యత్తు కోసం ఉపయోగించుకుంటా అని చెప్పారు. తన స్నేహితులతో ఆనందాన్ని పంచుకుంటా అని తెలిపారు. చూశారా.. అదృష్టం అంటే ఇదేనేమో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవడం అంటే..