Viral Video

Viral Video: 77 ఏండ్ల వృద్ధుడిపై డాక్టర్​ దాడి

Viral Video: డాక్టర్.. వైద్యం చేస్తాడు.. ప్రాణాలు పోస్తాడు.. అంతే కానీ పేషెంట్ల మీద చెయ్యి చేసుకుంటాడా.. అదే అలా చెయ్యి చేసుకున్న వీడియోనే వైరల్ గా మారింది.. డాక్టరే కాదు వాడి దగ్గర పని చేసే వర్కర్ కూడా పేషెంట్ మీద చెయ్యి చేసుకున్నాడు.. ముసలోడు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు.. అసలు ఎందుకు కొట్టారు.. తండ్రి వయసు ఉన్న వాడిని అలా ఎలా కొట్టారు..

వైద్యో నారాయణో హరిః వైద్యుడు భగవంతుడితో సమానం.. ఈ మాట మన పెద్దలు ఏనాడో చెప్పారు. అందుకే మన సమాజం డాక్టర్లకు ఉన్నత స్థానం ఇచ్చింది. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ వృద్దుడి పట్ల ప్రభుత్వ వైద్యుడు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఛతర్‌పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అమానవీయ సంఘటన జరిగింది.

77 ఏళ్ల వృద్దుడిపై డాక్టర్‌, రెడ్‌క్రాస్‌ వర్కర్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉద్ధవ్ సింగ్ జోషి అనే వృద్దుడు తన భార్య ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి సిబ్బందితో జరిగిన వాగ్వాదంలో డాక్టర్ రాజేష్ మిశ్రా అతన్ని కొట్టి, బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలొచ్చాయి.

Also Read: Maoists Surrender: 14 మంది మావోయిస్టులు లొంగుబాటు

ఆస్పత్రిలో అందరి మాదిరగానే స్లిప్ తీసుకుని చాలా సేపు క్యూలో నిలబడ్డానని, తన వంతు వచ్చినప్పుడు ముందుకు కదులుతుంటే డాక్టర్ రాజేష్ మిశ్రా అభ్యంతరం చెప్పాడు. అంతేకాదు వృద్దుడిని అని కూడా చూడకుండా చెంపదెబ్బ కొట్టి, తన్నాడని జోషి ఆరోపించారు. వీడియోలో ఇద్దరు వ్యక్తులు జోషిని కొడుతూ, ఆస్పత్రి నుంచి బలవంతంగా లాక్కెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఒక వ్యక్తి జోషిని కొట్టడం కూడా వీడియోలో కనిపిస్తోంది.

అయితే జోషి ఆరోపణలను ఆస్పత్రి సిబ్బంది తప్పుబడుతున్నారు. ఆస్పత్రిలో ఆ రోజు భారీగా జనాలు వచ్చారు. ఆ క్రమంలో జోషి క్యూలైన్‌ దాటి ముందుకు వచ్చారని, అందుకే డాక్టర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.

వృద్దుడిపై డాక్టర్‌ దాడికి పాల్పడిన ఘటనపై మధ్యప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ వీడియోను Xలో షేర్ చేస్తూ, రాష్ట్రంలో మోహన్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స బదులు హింసలు జరుగుతున్న ఈ అభివృద్ధి మోడల్ ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. పాలకులు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు సైతం స్పందించి, దర్యాప్తు చేపట్టారు.

ALSO READ  Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *