Dk aruna: కవిత కామెంట్స్ లో కొత్తేమీ లేదు

Dk aruna: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి మేం చాలా కాలం క్రితమే ప్రజలకు చెప్పామని బీజేపీ ఎంపీ డీకే అరుణ గుర్తు చేశారు. కవిత కోపంతోనే కొంతమంది పేర్లు బయటపెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కుటుంబంలోని విభేదాలను ప్రజలపై రుద్దడం సరికాదని ఆమె విమర్శించారు.

కేసీఆర్ కుటుంబం మొత్తం ఈ అవినీతికి బాధ్యత వహించాల్సిందేనని డీకే అరుణ డిమాండ్ చేశారు. అంతేకాక, అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు ఎందుకు వేయలేదని ఆమె ప్రశ్నించారు. అర్ధరాత్రి సీబీఐకి దర్యాప్తు అప్పగించడంలో అసలు ఉద్దేశ్యం ఏమిటో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కూడా ఆమె అన్నారు.

ఈ వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *