Disha Patani: సూర్య పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ భామ దిశా పటాని ఎంపిక అయ్యిందని తెలిసి ఆమె అభిమానులు ఆనంద పడ్డారు. ఓ పక్క సౌతిండియన్ పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఎ.డి.’తో పాటు ‘కంగువ’లోనూ ఆమె ఛాన్స్ దక్కించుకుందని సంబరాలు చేసుకున్నారు. ‘కల్కి’ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించినా… దిశా పటానీకి మాత్రం చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆమెపై చిత్రీకరించిన ఓ పాటను కూడా సినిమా విడుదలైన కొద్ది రోజులకు తొలగించారు. దాంతో అంతా డీలా పడ్డారు. ఆ లోటు ‘కంగువ’తో తీరుతుందని భావించారు. కానీ గురువారం జనం ముందుకొచ్చిన ‘కంగువ’ను, అందులోని దిశా పటానీ పాత్రను చూసి మరోసారి కంగుతిన్నారు. సినిమా ప్రారంభంలో ఓ పాటతో పాటు ఒకటి రెండు యాక్షన్ సీన్స్ లో మాత్రమే దిశా కనిపించడంతో ఇలాంటి స్పెషల్ అప్పీయరెన్స్ పాత్రలను ఆమె ఎందుకు అంగీకరిస్తోందనే ప్రశ్నను వేస్తున్నారు. అయితే… పాత్ర నిడివి ఎంత ఉన్నా… సినిమా హిట్ అయితే… దిశా పటానీకి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. కానీ దురదృష్టం ఏమంటే… ‘కంగువ’ సినిమాలో హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగా తక్కువ ఉన్నాయి.
