Dhanush: ‘కుబేర’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున సందడి చేశారు. వారి ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఈవెంట్‌లో ధనుష్ తన సీనియర్ హీరోల పట్ల చూపిన గౌరవం అందరినీ ఆకట్టుకుంది. నాగార్జునను స్టేజ్‌పైకి ఆహ్వానించగా, ముందుగా తానే మాట్లాడుతానంటూ ధనుష్ అదరగొట్టారు. చిరంజీవి, నాగార్జున ధనుష్ నటనను మెచ్చుకుంటూ, ఈ పాత్రకు ఆయనే సరైన ఎంపిక అన్నారు. నాలుగు జాతీయ అవార్డుల విజేత ధనుష్‌ను కొనియాడారు. చిరంజీవి ప్రసంగం తర్వాత ధనుష్ ఆయన కాళ్లకు నమస్కరించి, ప్రేమతో హత్తుకున్న సన్నివేశం హృదయాలు గెలిచింది. తెలుగు ఆడియెన్స్‌లో ధనుష్‌కు క్రేజ్ పెరుగుతోంది. భవిష్యత్తులో తన చిత్రాలను తెలుగులో డబ్ చేయడంతో పాటు, తెలుగు దర్శకులతో కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కుబేర’తో ధనుష్ తెలుగు సినిమాకు కొత్త ఊపు తెచ్చారని అభిమానులు అంటున్నారు.

