Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ శోభ సంతరించుకుంది ముక్కోటి ఏకాదశి సందర్భంగా కడప శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి భక్తులు పోటెత్తారు.ముక్కోటి ఏకాదశి కావడం తో స్వామి వారిని ప్రత్యేక పూల తో అలంకరించారు గోవిందుడు కన్నులు విందుగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో తెల్లవారుజామున నుండే స్వామి దర్శనం కోసం క్యులైన్ లో బారులు తీరారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వారా ప్రవేశం కల్పించారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Mukkoti Ekadasi 2025: మోక్షాన్ని ప్రసాదించే వైకుంఠ ఏకాదశి.. దీని ప్రాశస్త్యం ఏమిటంటే..
Vaikuntha Ekadashi: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే తమ కోరికలను నెరవేరతాయని భక్తుల విశ్వాసం.