Devara 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం దేవర సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని ఎన్టీఆర్ ఇటీవల జపాన్‌లో స్వయంగా కన్ఫర్మ్ చేశారు.
తాజాగా, ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ ఇచ్చిన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ, దేవర 2 ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత మొదలవుతుందని స్పష్టం చేశారు. అంతేకాదు, దేవర 2 కథ నరేషన్ కూడా పూర్తయినట్లు వెల్లడించారు.
Also Read: Bandla Ganesh: తీన్మార్ రీరిలీజ్? బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!
Devara 2: ఈ అప్‌డేట్‌తో సీక్వెల్‌పై అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఇదిలా ఉంటే, కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈ ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దేవర 2తో పాటు ఈ చిత్రం కూడా అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.