Delhi: ఫేక్ వార్తలు నమ్మొద్దు.. యూపీఐపై కేంద్రం స్పష్టం..

Delhi: దేశవ్యాప్తంగా యూపీఐ (UPI) లావాదేవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఇటీవల కొన్ని సోషల్ మీడియా వేదికలపై “రూ.3,000 దాటితే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వస్తాయి” అనే తప్పుడు ప్రచారం మొదలైంది. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ తీవ్రంగా స్పందించింది.

ఆర్థికశాఖ స్పష్టంగా తెలిపింది. యూపీఐ ద్వారా చేసే ఏదేనా లావాదేవీపై ప్రభుత్వ ఆధీనంలో ప్రస్తుతం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. రూ.3వేలు దాటి లావాదేవీలు చేస్తే ఛార్జీలు వేస్తారన్నది పూర్తిగా తప్పుడు సమాచారం. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది.

ప్రజలు ఈ రకమైన అధికారికంగా ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని కోరింది. ప్రస్తుతం యూపీఐ వ్యవస్థను ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఉచితంగా, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు అమలు చేస్తోంది. ఇది చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారుల మధ్య వేగవంతమైన, సురక్షితమైన, ఖర్చుల్లేని లావాదేవీలకు మార్గం వేస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకావొద్దని, అధికారికంగా వచ్చిన ప్రకటనలను మాత్రమే నమ్మాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *