Petrol: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఓ ఇంటి బావిలో నుంచి పెట్రోల్ బయటకు వస్తోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను రేపింది. ప్రజలు బకెట్లతో బావి నుంచి పెట్రోల్ తీసుకోవడానికి బారులు తీరారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
కొన్నిరోజులుగా తన పెట్రోల్ బంక్ లో పెట్రోల్ దొంగతనం జరుగుతోంది అంటూ బఫ్నా లోని పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న పెట్రోల్ పంపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడ నిఘా పెట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. కానీ, ఎటువంటి ఆధారమూ దొరకలేదు. కట్ చేస్తే..
ఇది కూడా చదవండి: UGC: ఇకపై డిగ్రీ రెండేళ్లలో పూర్తి చేయవచ్చు..!
Petrol: ఇప్పుడు బావిలో పెట్రోల్ రావడం ఏమిటని పోలీసులు దర్యాప్తు చేశారు. అక్కడ పెట్రోల్ బ్యాంకులో పెట్రోల్ మిస్సింగ్.. ఇక్కడ బావిలో పెట్రోల్ రెండిటికీ లింక్ ఉందని కనిపెట్టారు. నిజానికి పెట్రోల్ పంపులోని అండర్ గ్రౌండ్ ట్యాంక్ లీక్ అయిపోతోంది. అందులోంచి పెట్రోల్ భూమిలోకి ఇంకి పోతోంది. ఆ లీకవుతున్న ట్యాంక్ కి.. పెట్రోల వస్తున్న బావికి మధ్య కేవలం 300 మీటర్ల దూరం మాత్రమే ఉంది. లీకవుతున్న పెట్రోల్ ఇక్కడ బావి నుంచి నీళ్లతో కలిసి పైకి వచ్చింది. అదీ సంగతి.