gujarat

Gujarat: బాలుడిని హత్య చేసిన సిఆర్పిఎఫ్ పోలీస్..

Gujarat: గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలోని అంకలేశ్వర్ పట్టణంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే CRPF కానిస్టేబుల్ తన పొరుగువారి 8 ఏళ్ల బాలుడిని హత్య చేశాడు. స్టాక్ మార్కెట్‌లో నష్టాల కారణంగా కానిస్టేబుల్ శైలేంద్ర రాజ్‌పుత్ అప్పులపాలయ్యారు. అప్పు తీర్చేందుకు బాలుడిని

కిడ్నాప్ చేసి ట్రంక్‌ పెట్టెలో  బంధించాడు. దీంతో బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. అబ్బాయి  చనిపోయిన తర్వాత కూడా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రూ.5 లక్షల రూపాయలు ఇవ్వాలని బాలుడి  తండ్రికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఫోన్ ఉన్న లొకేషన్‌ను గుర్తించిన పోలీసులు నిందితుడు కానిస్టేబుల్ శైలేంద్రను పట్టుకుని అతని ఇంటి నుంచి ట్రంక్‌లో ఉంచిన బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: S. Jaishankar: యూఎస్ లో ట్రంప్ విజయంపై భారత్ కు ఆందోళన లేదు

Gujarat: శైలేంద్ర రాజ్‌పుత్‌ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు . అతను స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు.  అక్కడ అతను నష్టాల పాలయ్యాడు. అయినా సరే  అతను అప్పు తీసుకొని స్టాక్ మార్కెట్లో మరింత డబ్బును పెట్టుబడి పెట్టాడు. ఆ మొత్తాన్ని చెల్లించాలని అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తేవడంతో మనస్తాపానికి గురయ్యాడు. చివరికి, అతను బాలుడిని  కిడ్నాప్ చేసి, అప్పు తిరిగి చెల్లించడానికి డబ్బు డిమాండ్ చేయాలని ప్లాన్ చేశాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *