Crime News:వివాహేతర బంధాలు ఎంతకైనా బరితెగించేలా చేస్తున్నాయి. కుటుంబ సభ్యులనే మట్టుబెట్టే స్థాయికి చేరుకున్నాయి. కడుపున పుట్టిన వారిని సైతం బలితీసుకుంటున్న సంఘటనలు ఇటీవల ఎన్నో వెలుగు చూశాయి. ఇక్కడా అదే జరిగింది. తమ వివాహేతర బంధం కోసం దారిన పోయే ఓ వ్యక్తి ప్రాణాలను ఓ జంట నిలువునా తీసేసింది. దృశ్యం సినిమా సీన్‌ను మరిపించేలా ప్లాన్ చేసి చివరికి పోలీసులకు దొరికిపోయారు.
Crime News:గుజరాత్ రాష్ట్రంలోని జఖోట్రాలో వివాహిత గీతా అహీర్ (22)కు ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భరత్ (21) అనే యువకుడితో వివాహేతర బంధం ఏర్పడింది. ఆ బంధం కోసం తన భర్తను, కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్లిపోవాలని ఆ జంట నిర్ణయించుకున్నది. దీనికోసం ఆ ఇద్దరు పెద్ద ప్లానే చేశారు. తాను చనిపోయానని మరిపించేందుకు దృశ్యం సినిమా సీన్‌లా పకడ్బందీగా ఆలోచించారు.
Crime News:ఆ ప్లాన్ అమలు కోసం గీతా అహీర్, భరత్ ఆలోచిస్తుండగా, రోడ్డుపై హర్జీభాయ్ సోలంకీ (56) అనే వ్యక్తి వెళ్తున్నాడు. ఆ వ్యక్తిని నిలిపి నిర్ధాక్షిణ్యంగా చంపేశారు. మృతదేహానికి వివాహిత గీతా అహీర్ దుస్తులు, పట్టీలు తొడిగి మరీ తగులబెట్టారు. గీతా అహీర్ చనిపోయిందని భర్తను, ఇతర కుటుంబ సభ్యులను మరిపించాలని ఈ ప్లాన్ చేసి ఎక్కడికో దూరంగా పారిపోయారు.
Crime News:ఆ తర్వాత ఆ కాలిన మృతదేహం తన భార్య గీతా అహీర్‌దేనని ఆమె భర్త నమ్మాడు. ఆ తర్వాత ఆ కుటుంబసభ్యులు దహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే పోలీసులు పోస్టుమార్టం కోసం ఆ డెడ్‌బాడీని పంపారు. ఆ తర్వాత అసలైన విషయం తేలింది. ఆ మృతదేహం పురుషుడిదని తేలింది. దీంతో గీతా అహీర్, భరత్‌పై అనుమానంతో వెతికి పట్టుకొచ్చారు. పోలీసులు అరెస్టు చేయడంతో ఇప్పుడు ఆ ఇద్దరు ఊచలు లెక్కపెడుతున్నారు.