Crime news: శిశువులను విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 నెలల మగ శిశువును చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుంచి శిశువులను తీసుకొస్తూ ఒక్కో శిశువును రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ ముఠా 22 మంది శిశువులను విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
