Crime

Crime: కోడలిని చంపి పాతిపెట్టిన అత్తమామలు

Crime: ఈ రోజుల్లో మానవత్వాలు మంట కలుస్తున్నాయి. సొంత, పొరుగు అని తేడా లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. అంతెందుకు కన్న వాళ్లను కూడా కడతేర్చుతున్నారు. తమ సుఖం కోసం ఇంట్లో వ్యక్తులను కూడా వదలడం లేదు. ఈ సమాజంలో ఎదుటి వాడు ఎలా బ్రతికినా సరే.. తాను మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతకాలని కోరుకుంటున్నాడు. ఎవరి సౌకర్యం వారే చూసుకుంటున్నారు. అలా తయారైంది ఈ సమాజం.

Crime: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో గొడవలో లేదంటే ఇంకేమైనా కారణాలో తెలియదు కానీ.. కోడలిని చంపేశారు అత్తమామలు. రెండు నెలల క్రితం కోడలిని చంపి భూమిలో పాతిపెట్టారు. అయితే కొన్ని రోజులుగా ఈ విషయం భర్తకు తెలియలేదు. ఈ క్రమంలో.. తన భార్య కనిపించడం లేదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇది కూడా చదవండి: Brahma Anandam: ఆనందమానందమాయే…’ అంటున్న బ్రహ్మానందం తనయుడు!

Crime: అయితే.. పథకం ప్రకారం అత్తమామలు కూడ.. ఏమీ తెలియనట్లుగా తమ కోడలు కనిపించడం లేదంటూ కుమారుడితో పాటు కోడలు కోసం వెతికారు. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంక కదిలింది అన్న చందంగా దర్యాప్తులో అత్తమామలే చంపి పాతి పెట్టారని తేలింది. దీంతో.. పోలీసులు పాతిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. కోడలిని అత్తమామలు ఎందుకు చంపాల్సి వచ్చిందనేది పోలీసుల విచారణలో తేలనుంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: నల్ల బాగ్ అంటూ KTR..దండయాత్ర మొదలెట్టిన కాంగ్రెస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *