Coolie: మూడు రోజుల క్రితం క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న శ్రుతీహాసన్ ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి వచ్చేసింది. రజనీకాంత్ హీరోగా కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘కూలీ’ షూటింగ్ లో పాల్గొంది. నాగార్జున, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీలో ఆమీర్ ఖాన్ సైతం అతిధి పాత్రలో మెరుస్తున్నాడు. ప్రస్తుతం ‘కూలీ’కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను శ్రుతీహాసన్, జూనియర్ ఆర్టిస్టులపై చిత్రీకరిస్తున్నారు. అక్కడే యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారు దర్శకుడు లోకేశ్ కనకరాజ్. ఈ సినిమా వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజనీకాంత్ ఈ యేడాది నటించిన ‘లాల్ సలామ్’ పరాజయం పాలు కాగా, ‘వేట్టైయాన్’ ఫర్వాలేదనిపించింది. అయితే ‘జైలర్’ లాంటి ఓ బ్లాక్ బస్టర్ ను ఆ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. వారి కోరికను ‘కూలీ’ తీర్చుతుందేమో చూడాలి.
korean kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ రెడీ అవుతున్నాడు!
korean kanakaraju: గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఎంతో కష్టపడి చేసిన ‘మట్కా’ సినిమా సైతం అతనికి చేదు అనుభవాన్నే ఇచ్చింది. ‘ఎఫ్ -3’ తర్వాత ‘గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా’ చిత్రాలతో పరాజయాలలో హ్యాట్రిక్ సాధించాడు. ఎలాగైన సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యూవీ క్రియేషన్స్ తో కలిసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ దీనిని నిర్మిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో రూపుదిద్దుకునే ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ లో గతంలో ఎప్పుడు చేయని పాత్రను వరుణ్ తేజ్ చేయబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయని, ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ చెబుతున్నారు.