Coolie

Coolie: విడుదలకు ముందే చరిత్ర సృష్టించిన ‘కూలీ’!

Coolie: సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి తన హవాను చాటుకున్నారు. 7 పదుల వయస్సు దాటినా సౌత్ ఇండియా హీరోలకు గట్టి పోటీ ఇస్తూ, తాజాగా ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమై, వేగంగా పూర్తయింది. దీంతో రజనీ ఫ్యాన్స్‌తో పాటు కోలీవుడ్, టాలీవుడ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సంచలనం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ రూ.40 కోట్లకు, నెట్‌ఫ్లిక్స్ OTT రైట్స్ రూ.125 కోట్లకు అమ్ముడుపోయాయి. శాటిలైట్, ఆడియో, హిందీ రైట్స్‌తో కలిపి రూ.200 కోట్ల బిజినెస్ జరిగింది. తమిళ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు డీల్ అయ్యాయి. మొత్తంగా రిలీజ్‌కు ముందే ‘కూలీ’ రూ.750 కోట్ల బిజినెస్‌తో కోలీవుడ్ ఆల్‌టైం రికార్డు సృష్టించింది. తెలుగులో నాగవంశీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకోగా, రిలీజ్ తర్వాత ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతుందని మూవీ యూనిట్ ధీమాగా ఉంది. రజనీ స్టామినాకు ఇది మరో నిదర్శనం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *