AP News: ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూటమి పార్టీల మధ్య కీలకమైన చర్చలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రితో జరిగిన కూటమి నేతల సమావేశం సక్సెస్ అయింది. సీట్ల సర్దుబాటుపై నేతల మధ్య జరిగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కూటమిగానే కలిసి బరిలోకి దిగుతున్నట్లు జనసేన నేతలు స్పష్టం చేశారు. ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా, అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ సీట్ల పంపకాలు పూర్తి చేసినట్లు కూటమి నాయకులు తెలిపారు.
కూటమి పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరం ఒక్కటిగా కలిసి పోటీ చేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏవిధంగా అయితే కలిసి కట్టుగా ముందుకు వెళ్లి ఘన విజయం సాధించామో, అదే స్ఫూర్తితో ఈ స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేసి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశం తర్వాత కూటమి శ్రేణుల్లో ఎన్నికల ఉత్సాహం మరింత పెరిగింది.
