CM Revanth Reddy: ప్ర‌జా విజ‌యోత్స‌వాల‌పై సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఏడాది పూర్తికావ‌స్తున్న స‌మ‌యంలో ఈ నెల 14 నుంచి చేప‌ట్టిన ప్ర‌జాపాల‌న‌- ప్ర‌జా విజ‌యోత్స‌వం కార్య‌క్ర‌మాల‌పై సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ఆదేశాల‌ను జారీ చేశారు. ఈ ఏడాది కాలంలో చేప‌ట్టిన ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, సాధించిన విజ‌యాలు, వివిధ ప‌థ‌కాల అమ‌లును విస్త్ర‌తంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌పై శుక్ర‌వారం జ‌రిగిన స‌మావేశంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

CM Revanth Reddy: ప్ర‌జా పాల‌న విజ‌యోత్స‌వాల‌లో భాగంగా డిసెంబ‌ర్ 9 వ‌ర‌కు చేప‌ట్ట‌నున్న కార్య‌క్ర‌మాల‌ను ముందుగా అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివ‌రించారు. ఒక‌వైపు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూనే ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ముఖ్య‌మంత్రి వారికి వివ‌రించారు. ఈ విజ‌యోత్స‌వాల‌లో మూడు ప్రాంతాలైన వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

CM Revanth Reddy: మ‌హిళల సాధికార‌త‌, రైతుల సంక్షేమం, యూత్ ఎంప‌వ‌ర్‌మెట్‌కు ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిన నేప‌థ్యంలో వాటినీ ప్ర‌జ‌ల్లో తీసుకెళ్లేందుకూ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా వివిధ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నున్నారు. ఈ నెల 19న వ‌రంగ‌ల్ వేదిక‌గా 22 జిల్లాల్లో ఇందిరా మ‌హిళా శ‌క్తి భ‌వ‌నాల‌కు సీఎం శంకుస్థాప‌న చేస్తార‌ని నిర్ణ‌యించారు. డిసెంబ‌ర్ 7, 8, 9 తేదీల్లో హైద‌రాబాద్ ట్యాంక్‌బండ్‌, సెక్ర‌టేరియ‌ట్‌, నెక్లెస్ రోడ్ ప‌రిస‌రాల్లో విజ‌యోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

CM Revanth Reddy: డిసెంబ‌ర్ 9న స‌చివాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేయ‌నున్న తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌ల‌ను ఆహ్వానించనున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ విజ‌యోత్స‌వాల నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంతో పాటు తొలి ఏడాదిలో ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలు, కార్య‌క్ర‌మాల‌పై శాఖ‌లు, విభాగాల వారీగా ప్ర‌జ‌ల్లో తీసుకెళ్లాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు.

CM Revanth Reddy: ఈ స‌మావేశంలో మంత్రులు డీ శ్రీధ‌ర్‌బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్‌, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మ‌హేశ్‌కుమార్‌గౌడ్‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు వేం న‌రేంద‌ర్‌రెడ్డి, కే కేశ‌వ‌రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sivakarthikeyan: 300 కోట్ల క్లబ్ లో శివకార్తికేయన్!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *