Cm revanth: సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు – రాజకీయ ప్రత్యర్థులపై కౌంటర్

Cm revanth: తెలంగాణ రాజకీయాల్లో తాజా వేడి పుట్టించిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. చంచల్‌గూడ జైలులో తన అనుభవాల నుంచి ప్రత్యర్థులపై విమర్శలు వరకు, రేవంత్ తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

జైల్లో 16 రోజులు – కక్షసాధింపు విమర్శలు

“కక్ష సాధింపునకు పాల్పడితే మీరు చంచల్‌గూడలో ఉండేవారు. నన్ను ఎంపీగా ఉన్నప్పుడు చర్లపల్లి జైలుకు పంపారు. అక్కడ 16 రోజులు డిటెన్షన్ సెల్‌లో నిర్బంధించారు. ఆ రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. దేవుడు చూస్తాడని నమ్మకంతో వేచి చూశా. నేను ప్రమాణస్వీకారం చేసిన రోజే వాళ్లు ఆస్పత్రి పాలయ్యారు,” అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి.

విచక్షణాధికారాలపై సంచలన వ్యాఖ్యలు

“నేను కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మీ కుటుంబంలోని అందరూ జైలుకు వెళ్తారు. ఈ రోజు వరకు నేను ఎవరిపైన అక్రమ కేసులు పెట్టలేదు. పార్టీ ఆఫీసులో కూలీలతో పచ్చి బూతులు మాట్లాడించినా కూడా నేను కక్షతో వ్యవహరించలేదు. ముఖ్యమంత్రి విచక్షణాధికారాలు ఉపయోగిస్తే మీరు ఒక్కరైనా బయట ఉండేవారా?” అంటూ బీఆర్‌ఎస్ నేతలను తీవ్రంగా విమర్శించారు.

కేసీఆర్ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్‌రూమ్ హామీ

రేవంత్ రెడ్డి తన ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్య చేశారు. “కేసీఆర్ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చా. ఆ హామీ ఇంకా నెరవేర్చలేదు,” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రుణమాఫీ విమర్శలు

రైతుల రుణమాఫీ అంశంపై బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి, “బీఆర్‌ఎస్ నేతలు ఏకమొత్తంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఐదేళ్ల తర్వాత ఆ హామీ నెరవేర్చారు. మరోసారి అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లైనా రెండో విడత రుణమాఫీ చేయలేదు. పదేళ్లలో 21 లక్షల మంది రైతులకు రూ. 16,908 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. కానీ, మేం 25 లక్షల మందికి రూ. 20 వేల కోట్ల రుణమాఫీ చేశాం,” అంటూ తమ ప్రభుత్వం రైతులకు చేసిన సేవలను వెల్లడించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *