Hyderabad: సోషల్ మీడియాలో పెట్టే అభ్యంతరకర, అసభ్యకర పోస్టులపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఫోకస్ పెట్టారు. అలాంటి పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటి వరకూ చూసీచూడనట్టు ఉపేక్షించిన పోలీసులు ఈ సారి తగు చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఈ మేరకు సైబర్ పెట్రోలింగ్ ద్వారా సోషల్ మీడియా పోస్టులపై గట్టి నిఘా ఉంచినట్టు సమాచారం.
Hyderabad: అభ్యంతరకర, అసభ్యకర పోస్టులను ఎక్కువగా విద్యార్థులు పెడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. వారితోపాటు సాధారణ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఇలాంటి పోస్టులు పెడుతున్నారని తెలిపారు. క్షణికావేశంలో తమకు తోచిన అభిప్రాయాన్ని పోస్టులుగా పెడుతున్నారని, వీటి వల్ల ఇతరుల మనోభావాలు దెబ్బతినడంతోపాటు ప్రభుత్వ, ఇతరుల ప్రతిష్ఠలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని పోలీసులు పేర్కొంటున్నారు.
Hyderabad: ఇప్పటివరకూ ఇలాంటి పోస్టులు పెట్టిన వారంతా తొందరపాటుతో పెట్టామని, క్షమాపణలు కోరుతూ బాధ్యులు తప్పించుకుంటున్నారని, ఇప్పుడు అలాంటి క్షమాపణలతో తప్పించుకోలేరని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇతరుకు హాని కలిగించే ఎటువంటి పోస్టులపైనా తగు చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అందుకే పోస్టులు పెట్టేముందు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.