Chiranjeevi: న్యాచురల్ స్టార్ నాని ‘దసరా’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో నాని-శ్రీకాంత్ కాంబినేషన్‌లో ‘ది ప్యారడైజ్’ సినిమా అనౌన్స్ కాగా, అందరి దృష్టి మాత్రం శ్రీకాంత్ ఓదెల-మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్‌పై పడింది. ఈ సినిమా కోసం శ్రీకాంత్‌ను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లినది నానేనని తెలుస్తోంది.
శ్రీకాంత్ చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చడంతో, ఆయన ఓ ఆసక్తికర కండీషన్ పెట్టారట. ఈ సినిమాను నాని నిర్మిస్తేనే తాను నటిస్తానని చిరు స్పష్టం చేశారని సమాచారం. దీంతో, నాని ప్రొడక్షన్‌లో ఈ భారీ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి లాంటి లెజెండరీ హీరోతో శ్రీకాంత్ ఓదెల ఎలాంటి కథతో సంచలనం సృష్టిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్ట్ తెలుగు సినిమా పరిశ్రమలో మరో మైలురాయిగా నిలవనుందని టాక్.
