Chiranjeevi-Anil Ravipudi: అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత సాహూ గారపాటి భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ చేసాడు అనిల్ రావిపూడి. తాజాగా అనిల్ రావిపూడి.. సంగీత దర్శకుడు భీమ్స్ తో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుని మెగాస్టార్ సినిమా స్క్రిప్ట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భాంగా అనిల్ మాట్లాడుతూ మెగాస్టార్ తో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళుతుందని, ఇప్పటికే 90శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, మూడు నెలల్లో షూటింగ్ ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేస్తామని, ఈ సినిమాతో మరోసారి వింటేజ్ చిరును చూస్తారని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. ఇక ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా అతిధి రావు హైదరి పేరు వినిపిస్తుంది.
