Singer Chinmayi: టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ, వివాదాస్పద సింగర్ చిన్మయి శ్రీపాద మధ్య ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వార్ నడుస్తోంది. ఆడవారి దుస్తుల విషయంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఒకవైపు సంప్రదాయం గురించి శివాజీ మాట్లాడుతుంటే, మరోవైపు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చిన్మయి నిలదీస్తోంది.
అసలేం జరిగింది?
ఇటీవల జరిగిన ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. నేటితరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లు ఈవెంట్లకు వచ్చేటప్పుడు సావిత్రి, సౌందర్య లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని పద్ధతిగా చీరలు కట్టుకోవాలని సూచించారు. “గ్లామర్ పేరుతో హద్దులు మీరితే గౌరవం ఉండదు. శరీర భాగాలు కనిపించేలా బట్టలు వేసుకుంటే జనం నవ్వుకుంటారు” అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
Telugu Actor Sivaji doles out unnecessary advice to Actresses using slurs like ‘Daridrapu Munda’ saying they need to wear Saris to cover their ‘Saamaan’ – a word incels use.
Actor Shivaji played a villain in a fantastic film and end up becoming the hero for incel boys.
The…
— Chinmayi Sripaada (@Chinmayi) December 23, 2025
అంతేకాకుండా, స్త్రీ అంటే ప్రకృతి అని, పద్ధతిగా ఉంటేనే సమాజంలో గౌరవం పెరుగుతుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఈ క్రమంలో ఆయన వాడిన కొన్ని పదాలు ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి.
ఇది కూడా చదవండి: CM Chandrababu: క్వాంటం టెక్నాలజీకి ఏపీ కేరాఫ్ అడ్రస్.. ‘టెక్’ విప్లవానికి సీఎం చంద్రబాబు శ్రీకారం!
చిన్మయి ‘స్ట్రాంగ్’ కౌంటర్
శివాజీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సింగర్ చిన్మయి తీవ్రంగా స్పందించారు. శివాజీ వాడిన భాషను తప్పుబడుతూ ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.
- మీకెందుకు మినహాయింపు?: “మీరు మాత్రం జీన్స్, హూడీలు వేసుకుంటారు కానీ, హీరోయిన్లు మాత్రం పద్ధతిగా ఉండాలా? మీకు అంతగా సంప్రదాయం మీద ప్రేమ ఉంటే మీరు కూడా దోతీలు కట్టుకుని, బొట్టు పెట్టుకుని తిరగండి” అంటూ ఎద్దేవా చేశారు.
- భాషపై విమర్శలు: ఒక సినిమాలో మంచి పాత్ర చేసిన శివాజీ, బయట మాత్రం ‘పోకిరి’ భాష మాట్లాడుతున్నారని, షూటింగ్ సెట్స్‌లో మహిళలను ఇలాగేనా గౌరవించేది? అని నిలదీశారు0.
- సంప్రదాయం అంటే ఏంటి?: పెళ్లయిన మగవారు కూడా కంకణాలు, మెట్టెలు ధరించాలని, కేవలం మహిళల డ్రెస్సింగ్‌నే టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.
హాట్ టాపిక్‌గా మారిన ‘కోల్డ్ వార్’
ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ వివాదం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శివాజీ మాటల్లో పద్ధతిగా ఉండాలనే ఆకాంక్ష ఉందంటూ కొందరు సపోర్ట్ చేస్తుంటే, మహిళల స్వేచ్ఛను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని చిన్మయి వాదనను మరికొందరు బలపరుస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vince Zampella: కాల్ ఆఫ్ డ్యూటీ వీడియో గేమ్ కో క్రియేటర్ అమెరికాలో దుర్మరణం
సంప్రదాయం వర్సెస్ ఆధునికత మధ్య జరుగుతున్న ఈ పోరు ఎటు దారితీస్తుందో చూడాలి. ఒకవైపు శివాజీ తన మాటలకు కట్టుబడి ఉన్నానని అంటుండగా, మహిళల ఆత్మగౌరవం విషయంలో తాను తగ్గేదే లేదని చిన్మయి సంకేతాలిస్తున్నారు.
