Delhi: అత్యంత శక్తివంతమైన సీఎంగా చంద్రబాబు..

Delhi: ఏపీ సీఎం చంద్రబాబుకు జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ ఘన కీర్తినందించింది. అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలిపింది.దేశవ్యాప్తంగా శక్తిమంతులైన టాప్‌ టెన్‌ నేతల్లో చంద్ర‌బాబు ఐదో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఆయనకు ముందు తొలి నాలుగు స్థానాల్లో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నారు. అత్యంత శ‌క్తిమంతులైన సీఎంల‌లో చంద్ర‌బాబు తర్వాత బీహార్‌, యూపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రులు నితీశ్‌కుమార్‌, యోగి ఆదిత్యనాథ్‌, ఎంకే స్టాలిన్‌, మమతాబెనర్జీ, సమాజ్‌వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఉన్నారు.

ప్ర‌స్తుతం కేంద్రంలో చంద్ర‌బాబు చ‌క్రం తిప్పుతున్నారు. లోక్‌సభలో టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలను మినహాయిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సంక‌టం త‌ప్ప‌దు. అందుకే పాలక ఎన్‌డీఏలో ఆయ‌న కీల‌కం అయ్యారు. నాలుగోసారి సీఎం అయిన చంద్ర‌బాబు.. తన చిరకాల స్వప్నమైన స్వర్ణాంధ్ర సాధన, రాజధాని అమరావతి నిర్మాణం లక్ష్యాలను చాలా ఈజీగా చేరుకునే అవకాశం ఉంది. అని ‘ఇండియా టుడే’ త‌న కథనంలో రాసుకొచ్చింది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *