Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేటి రోజును ఓ చారిత్రక మలుపుగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు తలవంచిన రోజు ఇదని, అధికారం పేరిట ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టారని ఆయన గుర్తుచేశారు.
సైకో పాలనకు తెరదించి, ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, ప్రశాంతత కలిగించిన రోజు ఇదని ఆయన చెప్పారు. ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా మేం స్వీకరించామని చెప్పారు.
“ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పాలనను గాడిలో పెట్టాం. సంక్షేమాన్ని అందించడమే కాదు, అభివృద్ధి బాటలో నడిపించాం,” అని సీఎం తెలిపారు.
ఒక సంవత్సరం పూర్తైన నేపథ్యంలో నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రజలకు శిరస్సువంచి నమస్కారాలు చెప్పిన చంద్రబాబు, “వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం” అంటూ మాటిచ్చారు.
జూన్ 4… #PrajaTeerpuDinam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు…
ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు…
అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు…
సైకో పాలనకు అంతం పలికి…..ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు…… pic.twitter.com/HLfJg1A3tb
— N Chandrababu Naidu (@ncbn) June 4, 2025