Delhi: ఎన్నికలవేళ ఆప్ కి గట్టి షాక్.. సీఎం అతిశి పై కేసు నమోదు

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గోవిందపూరి పోలీస్ స్టేషన్‌లో అతిషిపై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫతే సింగ్ మార్గ్‌లో ఆప్ అభ్యర్థి అతిషి 50-70 మంది మద్దతుదారులతో పాటు 10 వాహనాలతో కనిపించారని, ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పోలీసుల సూచనను అతిషి అనుసరించలేదని, పైగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారిని అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఎన్నికల ముందు రాజకీయం వేడెక్కేలా చేసింది.

ఢిల్లీలో ఎన్నికలు – హస్తిన వాసుల తీర్పు ఏదో?

మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఢిల్లీలో 1.56 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

ఎగ్జిట్ పోల్స్ & పార్టీ హామీలు

సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలకానున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోయాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరఫున బలమైన ప్రచారం నిర్వహించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి రాలనుందా? బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటుందా? లేక కాంగ్రెస్ తిరిగి పునరుద్ధరించుకుంటుందా? హస్తిన వాసుల తీర్పు ఏదైనా ఆసక్తిగా మారింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nitish kumar: లాలు ప్రసాద్ యాదవ్ కామెంట్స్ పై నితీష్ షాకింగ్ రిప్లై

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *